ఐకేపీ వీఓఏ కుటుంబానికి ఐఎన్‌టీయూసీ భరోసా

కలం, నకిరేకల్‌: అనారోగ్యంతో అకాల మరణం చెందిన ఐకేపీ వీఓఏ పెరుమాళ్ల అనురాధ కుటుంబానికి ఐఎన్‌టీయూసీ(INTUC) ఆర్థికంగా అండగా నిలిచింది. నకిరేకల్‌ మండలం చందుపట్ల (Chandupatla) గ్రామంలో వీఓఏగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అనురాధ కుటుంబాన్ని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్నగౌడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జి. సంజీవరెడ్డి ఆదేశాల మేరకు, వీఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అందించిన ఆర్థిక సహాయాన్ని నాగన్నగౌడ్‌ మృతురాలి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా నాగన్నగౌడ్‌ మాట్లాడుతూ అనురాధ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఐకేపీ వీఓఏల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, వారి కుటుంబాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఐఎన్‌టీయూసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాదగోని కొండయ్యగౌడ్‌, వీఓఏల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్‌కుమార్‌, నల్లగొండ జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు అంబటి సోమన్న, గ్రామ కాంగ్రెస్‌ నాయకులు రంగారెడ్డి, సామ భాస్కర్‌రెడ్డి, గోలి శ్రావణ్‌రెడ్డి, సిలువేరు ప్రభాకర్‌, డి. వెంకటేష్‌, వీఓఏలు శోభారాణి, సంప్రద, శ్రీలత, లలిత, నిర్మల, రోజా, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>