నిరాడంబరంగా పదవీ విరమణ

కలం, వెబ్ డెస్క్: ’దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్యే రూపుదిద్దుకుంటుంది అంటారు. అలాంటి తరగతి గదిలోని విద్యార్థులను ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేర్చే దైవమే ఉపాధ్యాయుడు. విద్యార్థుల్ని సమాజ నిర్మాణంలో భాగస్వాముల్ని చేయడంలో ఉపాధ్యాయునిది అందెవేసిన చేయి. అయితే కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం బడికి వచ్చామా? వెళ్లామా? అన్నట్టు ఉంటారు. మరికొందరు మాత్రం తమ వృత్తిని ప్రాణంగా ప్రేమిస్తూ విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్తు అందిస్తారు. ఈ కోవకు చెందినవారు తక్కువే అయినా అలాంటి వారే చరిత్రలో నిలిచిపోతారు. ఉపాధ్యాయ వృత్తికే కాదు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సరైన నిర్వచనంగా తన సేవల్ని అందిస్తూ.. ప్రతీ పేద విద్యార్థిని బడి మెట్లు ఎక్కించే ప్రయత్నం చేసిన ఆ నిరడంబర గురువే వీ హనుమంత్ రెడ్డి(Hanumanth Reddy).

నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా పోలిశెట్టిపల్లి గ్రామంలో వీ హనుమంత్ రెడ్డి జన్మించారు. ఉద్యోగ బాధ్యతను భారంగా భావించే ఈ రోజుల్లో.. ఉపాధ్యాయ వృత్తి స్వీకరించిన ఆయన తమ ప్రాంతంలోని పాఠశాలల్లో కేవలం పుస్తకంలోని పాఠాలనే కాకుండా ఆర్ధిక తోడ్పాటుతో విద్యార్థులకు వెన్నంటూ నేనున్నా అంటూ భరోసానిచ్చారు. నేటితో ఆ గురువు 36 సంవత్సరాల 8 నెలలు ఉద్యోగం చేసి ఈరోజు పదవీ విరమణ పొందారు.

తన వృత్తి రిత్యా దాదాపు 21 సంవత్సరాలు నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోనే తన ఉపాధ్యాయ వృత్తి కొనసాగించారు. మండలవ్యాప్తంగా ఏ ఇంటిని తట్టిన కూడా ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా తన సేవలు అందని వారు లేరు. దీనితో ఉప్పునుంతల మండలంలోని పూర్వ విద్యార్థులకు తల్లిదండ్రులకు విడదీయలేని అనుబంధం ఉంది. 36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎక్కడా కూడా మచ్చ లేని సేవలందించారని పూర్వ విద్యార్థులు కొనియాడుతున్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం వరకే తమ వృత్తిగా భావిస్తారు. కానీ హనుమంతు రెడ్డి విద్యతో పాటు స్టూడెంట్స్ ఆర్థికంగా వెనకబడి విద్య మానేసే విద్యార్థులను సైతం ఆర్ధికంగా ఆదుకుంటు వారి విద్య పూర్తి చేసే విధంగా నిరంతరం కృషి చేశారు. ఇలా చెప్తా ఉంటే ఉపాధ్యాయ వృత్తిలో ఆయన సేవలు అనంతం. అమోఘం..అద్వితీయం. దానిని మాటల్లో వ్యక్తీకరించలేం. పాటల్లో వర్ణించలేం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఇలాంటి వ్యక్తి నిరాడంబరంగా తన పదవీ విరమణ కార్యక్రమం చేస్తున్నారంటే పూర్వ విద్యార్థులు చిరు సత్కారం కోసం ఉవ్విళ్లూరారు. కానీ ఆ నిరడంబర గురువు మరోసారి తన ఉదార స్వభావాన్ని నిక్కచ్చిగా చెప్పకనే చెప్పారు. సన్మానం, సత్కారాలకు అవకాశం కూడా లేకుండా ఎలాంటి ఆర్భాటం హంగులకు పోకుండా నేడు పదవీ విరమణ పొందారు. అందుకే ఆయన నిరాడంబర గురువయ్యారు. అందరికీ ఆదర్శనీయంగా మారారు‘ అంటూ పూర్వ విద్యార్థి జిల్లెల శ్రీకాంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>