Mobile Popup Ad
Mobile Popup Ad

యోగా దినోత్సవం.. ఇండియన్ నేవీ వినూత్న విన్యాసం!

కలం, వెబ్ డెస్క్ : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత నౌకాదళం ( Indian Navy) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. విశాఖపట్నంలోని ‘ఐఎన్‌ఎస్ శాతవాహన’ లో ఇండియన్ నేవీ అండర్ వాటర్ యోగా శిబిరాన్ని నిర్వహించింది. ఈ మేరకు సబ్ మెరైన్ విభాగానికి చెందిన 40 మంది సిబ్బంది నీటి అడుగున ఒకేసారి సమన్వయంతో యోగాసనాలు వేసిన వీడియోను ఐఎన్‌ఎస్ శాతవాహన తమ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పంచుకుంది. ఇండియన్ నేవీ వినూత్న విన్యాసానికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

యోగా నిపుణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేవీ సిబ్బంది నీటి అడుగున భుజంగాసనం లాంటి ఆసనాలను కూడా ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ వినూత్న కార్యక్రమం యోగా శక్తిని, నౌకాదళ సిబ్బంది క్రమశిక్షణను, శారీరక – మానసిక దృఢత్వాన్ని ప్రతిబింబించింది. విధి నిర్వహణలో ఎదురయ్యే తీవ్ర ఒత్తిడిని అధిగమించేందుకు శారీరక, మానసిక దృఢత్వం ఎంత అవసరమో ఈ అండర్ వాటర్ యోగా సెషన్ ద్వారా నేవీ తెలియజేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>