ఆర్ఎస్ఎస్ చీఫ్ ప‌ర్య‌ట‌న‌పై నిర‌స‌న‌.. భార‌త జెండాకు అవమానం!

క‌లం, వెబ్‌డెస్క్‌: న్యూయార్క్‌లో భార‌త జాతీయ‌ జెండా (Indian Flag)కు తీవ్ర అవ‌మానం జ‌రిగింది. స్థానికంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Mohan Bhagwat) ప‌ర్య‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ప‌లువురు ఖ‌లీస్తాన్ అనుకూల సిక్కు నిర‌స‌న‌కారులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌ల్లో భార‌త జాతీయ జెండాను అవ‌మానించారు. మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద ప్రవాస భారతీయ సభలో ప్రసంగించారు. అయితే, ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా సిక్స్ ఫర్ జస్టిస్ నేత గురుప‌త్వంత్ సింగ్ ప‌న్నూన్ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నిస‌ర‌న‌కు దిగారు. భార‌త్‌లో హిందూ జాతీయ‌వాదంం, మైనారిటీల హ‌క్కుల‌కు సంబంధించిన అంశాల‌పై నిర‌స‌న‌కారులు విమ‌ర్శ‌లు చేశారు. కొందరు నిరసనకారులు భారత జాతీయ జెండాను ధ్వంసం చేసి అగౌరవపరిచారు. అలాగే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న భారతీయ ప్రవాసులు, మద్దతుదారులు జెండాను అవమానించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ తీవ్ర వివాదాలు, నిరసనల నడుమనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రపంచ బాధ్యత, ఐక్యత గురించి ఆయన మాట్లాడారు. ప్రవాస భారతీయులు తమ మూలాల‌తో అనుబంధం కలిగి ఉంటూనే, తాము ఉంటున్న దేశం పట్ల విధేయతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ సంస్థలు, ప్రవాస భారతీయులతో సంబంధాలను బలపడటమే లక్ష్యంగా మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ ఈ పర్యటన చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>