కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఇరాన్ (Iran) జరిపిన షిప్ బ్లాస్ట్ ఘటనలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఇటీవల ఇరాక్ (Iraq) దగ్గర ఓ కార్గో షిప్‌పై ఇరాన్ దాడి చేసింది. అండర్ వాటర్ డ్రోన్ ద్వారా షిప్‌ను పేల్చేసింది. ఈ ఘటనలో మెరైన్ ఇంజినీర్‌గా పని చేస్తున్న దేవానందన్ (Engineer Devanandan) ప్రాణాలు కోల్పోయారు. దేవానందన్ ఇరాక్ దగ్గర అమెరికాన్ ఆయిల్ ట్యాంకర్‌లకు సంబంధించి చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆయన పని చేస్తున్న ట్యాంకర్‌పైనే ఇరాన్ దాడి చేసింది. బీహార్‌కు చెందిన దేవానందన్ ముంబైలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Also: ప్రకృతి సేద్యంతో అద్భుతాలు.. గుంటూరు రైతుకు సీఎం ప్రశంసలు!
Follow Us On : WhatsApp

