Mobile Popup Ad
Mobile Popup Ad

కుప్పకూలిన విమానం.. ఐదుగురు మృతి

కలం, వెబ్ డెస్క్: అస్సాంలోని జోర్హాట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్ 32 ట్రాన్స్పోర్ట్ విమానం కుప్పకూలింది. జోర్హాట్ ఎయిర్ బేస్ లో IAF AN-32 ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానం ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా కిందపడగానే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పెద్దఎత్తున మంటలు, పొగలు చెలరేగడంతో విమానం ధ్వంసమైంది. ఈ విమానం భారత వాయుసేనలో 40 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జోర్హాట్ విమాన ప్రమాదంపై ఐఏఎఫ్ (IAF) ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తునకు ఆదేశిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>