కలం, స్పోర్ట్స్: జపాన్‌పై భారత మహిళల జట్టు (India vs Japan) దుమ్మురేపింది. ఆసియా గేమ్స్ (Asian Games) క్వార్టర్ఫైనల్లో జపాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దీంతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. శ్రేయాంక కాదు.. శ్రీ చరణి బౌలింగ్‌లో అదరగొట్టింది. ఆమె 4 వికెట్లు తీసి కేవలం 10 పరుగులు ఇచ్చింది. షఫాలీ వర్మ 2 వికెట్లు పడగొట్టింది. జపాన్ తరఫున అయాకా కాటో-స్టాఫర్డ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు.
58 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చింది. కేవలం 15 బంతుల్లోనే 40 పరుగులు చేసింది. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కమలిని డకౌట్ కాగా, భర్తి ఫుల్మాలి 6 పరుగులు చేసి వెనుదిరిగింది. ఆ తర్వాత రిచా ఘోష్‌తో కలిసి షఫాలీ లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత్ కేవలం 5 ఓవర్లలో 59 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 90 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో భారత్ ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
Also Read : ‘ధర్మం మన DNAలోనే ఉంది’.. మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

