కలం, వెబ్ డెస్క్ : తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీ పేరు, గుర్తుకు సంబంధించిన వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరును, ‘ఫుట్బాల్ ప్లేయర్’ (Football Player) గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ఈ వర్గానికి గుర్తింపు కొనసాగుతుంది.
మరోవైపు, అరూప్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఎన్వెలప్’ (Envelope) గుర్తును రాబోయే ఉపఎన్నికల కోసం కేటాయించారు. పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా ఇరు వర్గాలు హక్కులు కోరడంతో ఎన్నికల సంఘం ఈ తాత్కాలిక నిర్ణయాన్ని వెలువరించింది.

