Mobile Popup Ad
Mobile Popup Ad

‘2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్’

అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) పేర్కొన్నారు. ఇదే విధంగా ముందుకు వెళ్తే అతి త్వరలోనే భారత్‌కు తన సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్రో(ISRO) భవిష్యత్ లక్ష్యాలపై శనివారం ఆయన మాట్లాడారు. అంతరిక్ష రంగంలో భారత్ వేసుకున్న ప్రణాళికల ప్రకారం ముందుకు సాగిస్తే 2035 నాటికి భారత్‌కు సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందని పునరుద్ఘాటించారు. అలాగే 2040 నాటికి ఓ భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఇటీవలి కాలంలో నమోదవుతున్న పురోగతిని, గగన్‌యాన్ వంటి కీలక మిషన్లను దృష్టిలో ఉంచుకుంటే, ఈ లక్ష్యాలు సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అంతరిక్ష పరిశోధనలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మంత్రి(Jitendra Singh) అన్నారు. టెక్నాలజీ, శాస్త్ర పరిశోధన, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం అన్నీ కలుపుకుంటే ఈ పెద్ద లక్ష్యాలు చేరువలో ఉన్నాయని అన్నారు.

Read Also: యుద్ధం ఎక్కడయినా గెలిచేది భారత్‌యే: లెఫ్టినెంట్ జనరల్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>