Mobile Popup Ad
Mobile Popup Ad

రష్యాతో రూ.2,182 కోట్ల ‘మిస్సైల్’​ ఒప్పందం

కలం, వెబ్​ డెస్క్​: భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ నేవీ, ఎయిర్​ఫోర్స్​ను మరింత బలోపేతం చేసే దిశగా మంగళవారం రూ.5,083కోట్ల విలువైన రెండు కీలక ఒప్పందాలను చేసుకుంది(India – Russia). ఇందులో ఒకటి రష్యాతో కావడం విశేషం. ఇప్పటికే రష్యా నుంచి ఆయిల్​, ఆయుధాల కొనుగోళ్లు చేస్తుండడంపై భారత్​ మీద అమెరికా గుర్రుగా ఉంది. ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రష్యాతో భారత్​ కీలక ఒప్పందం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, మరో ఒప్పందం.. హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెట్​(హెచ్​ఏఎల్​)తో చేసుకున్నది.

ఈ ఒప్పందాల్లో భాగంగా భారత తీర రక్షక దళానికి ఆరు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల (ALH) కొనుగోలు, నేవీకి ష్టిల్​ సర్పేస్​ టు ఎయిర్​ మిస్సైళ్లను సరఫరా చేస్తారు. ఇందులో రూ.2,901 కోట్లు సముద్ర రక్షణ పాత్రలో ALH Mk-III హెలికాప్టర్ల కొనుగోలుకు కేటాయించారు. ఇందులో ఆపరేషనల్ సామగ్రి, ఇంజినీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ, పెర్ఫార్మెన్స్ ఆధారిత లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

ఈ ట్విన్-ఇంజిన్ హెలికాప్టర్లు ప్రస్తుతం ఉన్న వాటికంటే ఆధునిక, అధునాతన వ్యవస్థలతో రూపొందినవి. ఇవి విమానాశ్రయాలతోపాటు నౌకల నుంచి కూడా పనిచేయగలవు. వీటి ప్రవేశంతో భారత తీరరక్షక దళం ఆపరేషనల్ బలం గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. కృత్రిమ ద్వీపాలు, ఆఫ్‌షోర్ ఇన్‌స్టాలేషన్లు, మత్స్యకారులు, సముద్ర పర్యావరణాన్ని రక్షణ సులభమవుతుందన్నారు.

రష్యాతో ఒప్పందంలో(India – Russia).. ఆ దేశానికి చెందిన JSC రోసోబోరోన్‌ ఎక్స్‌పోర్ట్‌తో రూ.2,182 కోట్ల విలువైన ష్టిల్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైళ్ల సరఫరాపై సంతకం చేశారు. ఇందులో మిసైల్ హోల్డింగ్ ఫ్రేమ్‌లు కూడా ఉన్నాయి. ఈ వర్టికల్ లాంచ్ మిసైల్ వ్యవస్థలను నేవీలోని ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలపై అమరుస్తారు. ఇవి నావికాదళం ఎయిర్ డిఫెన్స్​ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ బలోపేతం చేస్తుందని, తక్షణ ప్రతిస్పందన, అన్ని వాతావరణాల్లో ఎదురుకొనే సామర్థ్యం అందిస్తుందని పేర్కొంది.

Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. రాత్రికి రిటన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>