epaper
Tuesday, March 3, 2026
epaper

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. రాత్రికి రిటన్

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ హైకమాండ్‌తో పలు అంశాలపై చర్చించనున్నారు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ మంత్రులు, సీనియర్ నేతలను ప్రచారానికి పంపడం, బాధ్యతలను అప్పజెప్పడం తదితరాలపై చర్చించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం కూడా చర్చకు రావచ్చనే వార్తలు వెలువడుతున్నా దానిపై స్పష్టత లేదు.

రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై చర్చించవచ్చని తొలుత అనుకున్నా హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికే నామినేషన్లు వేయడం కూడా కంప్లీట్ అవుతుందని పార్టీ వర్గాలు సూచించాయి. దీంతో రాజ్యసభ అభ్యర్థుల చర్చ లేనట్లేనని పేర్కొన్నాయి. కీలక అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తదితరులతో చర్చించిన తర్వాత రాత్రికి తిరుగు ప్రయాణమై సినీ నటులు దేవరకొండ విజయ్, రష్మికా మందన్న దంపతుల వెడ్డింగ్ రిసెప్షన్‌కు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాజరుకానున్నారు.

Read Also: అరెస్ట్ చేసినా పోరాటం ఆగదు: కవిత

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!