బెంబేలెత్తించిన భారత బౌలర్లు.. విండీస్ చిత్తు

కలం, స్పోర్ట్స్: ఇండియా, వెస్టిండీస్ (IND vs WI) మూడో టీ20లో భారత బౌలర్లు రఫ్ఫాడించారు. రెండో టీ20 ఓటమికి బౌలింగ్ వైఫల్యాలే కారణమన్న విమర్శలకు చెక్ పెట్టారు. తొలి బంతి నుంచే కరేబియన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వాళ్ల మూలస్తంభంగా ఉన్న హోప్‌ను 5 పరుగులకే పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత కూడా ప్రతి బౌలర్ పరుగులకు కట్టడి చేయడమే కాకుండా వికెట్లు తీయడంలో కూడా పోటీ పడ్డారు. మూడో టీ20లో భారత బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబరిచినా బౌలర్లు మాత్రం విజృంభించారు. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్ ఇద్దరూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో విండీస్‌పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు స్టార్టింగ్‌లోనే భారీ షాక్ తగిలింది. రెండో టీ20లో అదరగొట్టిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌(IND vs WI)లో చేతులెత్తేశాడు. 6 బంతుల్లో 3 పరుగులు చేసి షామర్ జోసెఫ్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. కానీ వన్ డౌన్‌లో దిగిన ఇషాన్ కిషన్‌తో కలిసి అభిషేక్ శర్మ స్కోర్ కార్డ్‌ను వేగంగా పరుగులు పెట్టించాడు.115 పరుగుల దగ్గర ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయాడు. 18 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేసిన కిషన్ క్యాచ్ అవుటయ్యాడు.

దాంతో అభిషేక్ కాస్తంత జాగ్రత్తగా ఆడటం షురూ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1) అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ తన వికెట్ కోల్పోయాడు. అప్పటికే అభిషేక్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ నిలబడతాడనుకున్నా 28 పరుగులకే వెనుదిరిగాడు.నమన్ ధీర్(10), నితీష్ కుమార్ రెడ్డి(21), అక్సర్ పటేల్(20), అర్ష్‌దీప్ సింగ్ (11), ప్రిన్స్‌యాదవ్ (13), మయాంక్ యాదవ్ (0) పరుగులు చేశారు. దీంతో అభిషేక్ శర్మ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

వెస్టిండీస్ బౌలర్లలో ప్రతి ఒక్కరూ తమ ఖాతాలో వికెట్ వేసుకున్నారు. ఛేజ్, జోసెఫ్, స్ప్రింగర్ తలా రెండు వికెట్లు తీశారు. కీమో పాల్, గుడకేష్ మోటీ చెరో వికెట్ తీశారు. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో ప్రతి విండీస్ బౌలర్ సక్సెస్ అయ్యారు. జోసెఫ్ 4 ఓవర్లకు 54 పరుగులిచ్చి అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు.

224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు స్టార్టింగ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ షై హోప్ 5 పరుగులకే వికెట్ కోల్పోయాడు. దీంతో విండీస్‌ జట్టు ఆరంభంలోనే ఒత్తిడిని ఎదుర్కొంది. రెండో ఓపెనర్ కమిల్ పూరన్ వన్‌ డౌన్ బ్యాటర్ హెట్‌మేయర్‌తో కలిసి మ్యాచ్‌ను గాడిన పెట్టడానికి ప్రయత్నించినా భారత బౌలర్లు అందుకు అవకాశం ఇవ్వలేదు. 67 పరుగుల దగ్గర విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్న హెట్‌మేయర్‌ను నమన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అక్సర్ పటేల్ కూడా రోవ్‌మన్ పోవెల్ వికెట్ తీసి విండీస్‌పై మరింత ఒత్తిడి పెట్టాడు. అప్పుడు బరిలోకి దిగిన షెర్‌ఫేన్ రూథర్ ఫోర్డ్ బాదడం షురూ చేద్దాం అనుకునే సమయానికి నమన్ ధీర్ బౌలింగ్‌లో పూరన్ వికెట్ కోల్పోయాడు.

ఆ తర్వాత క్వెంటిన్ సాంప్‌సన్ (21), కీమో పాల్ (10) వికెట్ కోల్పోయారు. ఉన్న కాసేపు అదరగొట్టిన రూథర్‌ఫోర్డ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పురుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఆల్‌రౌండర్ ఛేజ్‌తో కలిసి స్ప్రింగర్ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. ఛేజ్ 5 పరుగులు చేస్తే స్ప్రింగర్ 11 బంతుల్లో 35 పరుగులతో అదరగొట్టాడు. కానీ బంతులు లేకపోవడంతో విండీస్ ఓటమి పాలయింది. నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్ల బౌలింగ్ చేసి 44 పరుగులు ఇచ్చాడు. దాంతో పాటు హోప్, పాల్, రూథర్‌ఫోర్డ్ లాంటి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. నమన్ ధీర్ కూడా 3 ఓవర్లకు 39 పరుగులిచ్చి 2వికెట్లు తీశాడు. అక్సర్ పటేల్, నితీష్ కుమార్ చెరో వికెట్ తీశారు. రెండో టీ20లో మూడు వికెట్ల మ్యాజిక్ స్పెల్ వేసిన మయాంగ్ యాదవ్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ 34 పరుగులిచ్చి కరేబియన్స్ స్పీడ్‌కు బ్రేకులు వేశాడు. ప్రిన్స్ యాదవ్ కూడా మాయంక్ బాటలోనే వెళ్లి 4 ఓవర్లలో 37 పరుగులతో విండీస్‌ను కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

Also Read : ప్రతిపక్షాలతో సమావేశానికి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>