Mobile Popup Ad
Mobile Popup Ad

భారత్‌కు సఫారీలు షాక్.. టోర్నీలో తొలి ఓటమి!

కలం, స్పోర్ట్స్: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురయింది. మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ (IND vs SA) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సఫారీలకు సరిపడా లక్ష్యాన్ని అందించడంలోనే కాకుండా.. లక్షణ ఛేదన సమయంలో దక్షిణాఫ్రికా ప్లేయర్లను కట్టడి చేయడంలో కూడా భారత్ కాస్త తడబడింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. భారత్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాప్రికా 4 వికెట్ల నష్టంతో ఛేదించింది. ఒక ప్లేయర్ల విషయానికి వస్తే భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్థశతకం చేయలేదు. 31 పరుగులతో షఫాలీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్‌లో శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టినా మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సఫారీల జట్టులో మరిజన్నే కప్ అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా మెరుపులు మెరిపించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (17 పరుగులు, 12 బంతులు) వేగంగా ఆడే క్రమంలో కప్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేసి ధాటిగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన యాస్తికా భాటియా (15), జెమిమా రోడ్రిగ్స్ (12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (24) క్రీజులో నిలదొక్కుకున్నా భారీ స్కోర్లు చేయలేకపోయారు. చివర్లో దీప్తి శర్మ 21 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నే కప్, షబ్నిమ్ ఇస్మాయిల్ చెరో రెండు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.

159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు (IND vs SA) భారత బౌలర్ శ్రీచరణి ఆరంభంలోనే గట్టి షాకిచ్చింది. ఒకే ఓవర్లో కెప్టెన్ లారా వాల్వార్డెట్ (20), అన్నేరీ డెర్క్సన్ (0)లను అవుట్ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చింది. ఆ తర్వాత వచ్చిన మరిజన్నే కప్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికా వైపు తిప్పేసింది. కప్ కేవలం 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 81 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (40) ఆమెకు చక్కని సహకారం అందించింది. భారత బౌలర్లలో శ్రీచరణి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేయగా, షఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది. దక్షిణాఫ్రికా మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో ఘనవిజయం నమోదు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>