Mobile Popup Ad
Mobile Popup Ad

రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన సభ!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన (Jana Sena) పార్టీని విస్తరించడానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలోనూ పార్టీని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు జన సైనికులను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఢిల్లీ వేదికపై సైతం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో ఆదివారం మల్కాజ్ గిరి పార్లమెంటరీ ముఖ్య నాయకుల సమావేశంజరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల బలోపేతం కోసం రామ్ తాళ్లూరి దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజులలో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థాయిలో భారీ సభ ఏర్పాటుపై చర్చించారు. దీంతో త్వరలోనే తెలంగాణలో జనసేన భారీ సభ ఉండబోతుందని తెలుస్తోంది.

అటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలో పలువురు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. డాక్టర్ గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంకు చెందిన పుదారి శ్యామ్ కుమార్, అల్లూరి నాగరాజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మిరియాల రామకృష్ణ, బండి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

తెలంగాణలో జనసేన సభ సంపూర్ణంగా నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన పార్టీ ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అనాలోచిత విధానం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అశాంతి నెలకొన్నాయన్నారు. అడ్డగోలు విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ధోరణి ఏమాత్రం మారలేదని మండిపడ్డారు.

Read Also: చిట్‌చాట్‌లో బాంబు పేల్చిన గుత్తా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>