100 ఎమ్మెల్యే సీట్లు మా టార్గెట్: మహేశ్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడమే తమ టార్గెట్ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని.. ఎమ్మెల్యేలు యాక్టీవ్ అయ్యారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. తమ మధ్య అద్భుతమైన సమన్వయం ఉందన్నారు. నవంబర్ తరువాత తాము పూర్తిగా ఎలక్షన్ మోడ్‌లోకి వెళ్తామని.. అన్ని సమస్యలకు అప్పుడే పరిష్కారం దొరుకుతుందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు తాను కూడా చూసినట్లు వివరించారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు, ఉచిత కరెంట్, 90 వేల ఉద్యోగాలు పొందినవారు తమకు కచ్చితంగా ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆలోచన లేకుండా..

కేసీఆర్ (KCR) మేధావి అనుకుంటామని.. కానీ ఆలోచన లేకుండా అప్పులు చేయడంతో ఇప్పుడు ఆర్థికంగా భారమవుతోందని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు భ్రమల్లో ఉన్నారని.. వారికి గ్రౌండ్ రియాలిటీ అర్థం కావడం లేదన్నారు. దేశమంతటా ఎల్ నినో (El Nino) ప్రభావం ఉంటే హరీశ్ రావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, తెలంగాణలో అధికారంలోకి రావడమనేది సాధ్యం కాని పని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న 8 మంది బీజేపీ ఎంపీల్లో ఇద్దరు గెలవడమే ఎక్కువన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 శాతం సీట్లు తమకే రాబోతున్నాయని వివరించారు.

Also Read : ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు హరీశ్ రావు సపోర్ట్..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>