భూత్పూర్‌లో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కలిసి కాపురం చేయాల్సిన భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. గొడవల కారణంగా భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన సంఘటన భూత్పూర్ (Bhuthpur) మండలం మొల్గర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామానికి చెందిన కంపిల్ల వెంకటయ్య, ఆయన భార్య అలివేలు (50) మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలోనే శనివారం ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో, మాట మాట పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటయ్య భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అలివేలు అక్కడికక్కడే మృతి చెందింది. భార్యాభర్తల మధ్య నిత్యం జరిగే గొడవలే ఈ హత్యకు కారణమని మృతురాలి కుమార్తె మంజుల తెలిపింది. ఘటనపై సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>