ఉద్యమకారుల ఆందోళన.. గాంధీ భవన్ వద్ద హై టెన్షన్

క‌లం, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్ (Gandhi Bhavan) వ‌ద్ద గురువారం తెలంగాణ ఉద్య‌మ‌కారులు చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ‌కు ఇచ్చిన హామీలు వెంట‌నే నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్య‌మ‌కారులు ప్లకార్డులు ప‌ట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. భిక్షాట‌న చేసి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల గుర్తింపు, సంక్షేమంపై వెంట‌నే జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేసి ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళ‌న‌తో గాంధీ భ‌వ‌న్ ప‌రిస‌రాల్లో హై టెన్ష‌న్ నెల‌కొంది. దీంతో పోలీసులు భారీ ఎత్తున అక్క‌డికి చేరుకొని నిర‌స‌నకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని బ‌ల‌వంతంగా వాహ‌నాల్లో ఎక్కించి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Read Also: బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా వి. హనుమంతరావు నియామకం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>