కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగరంలో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం (Heavy Rain) తో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్, ప్రశాంత్ నగర్, హంటర్ రోడ్‌తో పాటు అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొందరు వాహనాలను నెమ్మదిగా నడుపుతూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రద్దీ రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలింది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేకుంటే వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
Read Also: ఇస్రోకు ఊహించని షాక్.. అసలు కారణం ఇదేనా?
Follow Us On : WhatsApp

