కలం, వెబ్ డెస్క్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 55 మంది సివిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ (Cyberabad CI Transfers) చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన కారణాలతోనే ఈ బదిలీలు చేపట్టినట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త బాధ్యతలను స్వీకరించాల్సిందిగా సీపీ ఆదేశించారు.
ఈ బదిలీలలో భాగంగా పలు కీలక పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు (SHO), డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు (DI) మారారు. కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న కె.వి. సుబ్బారావును మాదాపూర్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేయగా, పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న డి.స్వామి గౌడ్‌ను కూకట్‌పల్లి కొత్త ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అలాగే రాయదుర్గం డీఐ టి.భూపతిని అదే స్టేషన్‌కు ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. సైబర్ క్రైమ్స్ విభాగంలో ఉన్న జి.విజయ్ కుమార్‌ను కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌ఓగా, పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఎన్.జయరామ్‌ను మియాపూర్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ బాధ్యతలను విఆర్ లో ఉన్న కె.సైదులుకు అప్పగించారు.
మరికొన్ని కీలక బదిలీలను పరిశీలిస్తే, జీ ప్రశాంత్‌ను బాలానగర్ ఎస్‌హెచ్‌ఓగా, డి.విష్ణువర్ధన్ రెడ్డిని నార్సింగి ఎస్‌హెచ్‌ఓగా, చల్లా సైదిరెడ్డిని కొల్లూరు ఎస్‌హెచ్‌ఓగా, ఎ.ఆర్.ఇ.శ్రీధర్‌ను చందానగర్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఎస్ఓటీ శేరిలింగంపల్లిలో విధులు నిర్వహిస్తున్న బి.అంజిరెడ్డిని మేడ్చల్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. దుండిగల్ డీఐగా ఉన్న ఎం.బాల్ రెడ్డిని అదే స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.

