కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCUలో గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. యూనిర్సిటీలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని ఆరోపణలు రావడంతో ఈగల్ టీమ్ దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు డ్రగ్ టెస్ట్‌లు నిర్వహించారు. వర్సిటీలోని 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వర్సిటీలో గంజాయి అమ్ముతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాం నుంచి గంజాయి తీసుకొచ్చి ఒక్కో గ్రాము రూ.500 చొప్పున వర్సిటీలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఇక్కడ గంజాయి రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

