కారు ఢీకొని పోలీస్ కానిస్టేబుల్ మృతి

కలం, జనగామ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మాల టోల్‌ప్లాజా (Kommala Toll Plaza) సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ధనంజయ్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వ్యక్తిగత పనిమీద జనగామకు వెళ్లిన ధనంజయ్ ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, కొమ్మాల టోల్‌ప్లాజా సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>