వేయి స్తంభాల గుడి విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి: క‌లెక్ట‌ర్ చాహ‌త్‌

కలం, హనుమకొండ: చారిత్రక వేయి స్తంభాల ఆలయ (Thousand Pillar Temple ) అభివృద్ధి, ఆవరణ విస్తరణకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియకు ఇళ్ల యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కోరారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో భూసేకరణకు సంబంధించిన అంశాలపై అధికారులతో పాటు ఇళ్ల యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పురావస్తు ప్రాధాన్యత కలిగిన వేయి స్తంభాల ఆలయ పరిసరాల విస్తరణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఆలయ ఆవరణ విస్తరణతో చారిత్రక కట్టడం అభివృద్ధికి మరింత అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు ఇళ్ల యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, కుడా డిప్యూటీ కలెక్టర్, కుడా పీఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>