ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల స్టూడెంట్స్ సత్తా

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో (Inter 2026 Results) మైనారిటీ గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల మానకొండూర్ బాలుర -1 ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ తెలిపారు. ఎంపీసీ (MPC), బైపీసీ (BIPC) విభాగంలో హుజురాబాద్ బాలుర కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో ఎన్.రాజకుమార్ స్వామి 948/1000, అంజన్న 900/1000, ఎం.రాహుల్ 916/1000, శ్రీనాథ్ రెడ్డి 913/1000 మార్కులు సాధించినట్లు తెలిపారు.

అదే విధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొహమ్మద్ హనీఫ్ 447/470, మొహమ్మద్ సమీర్ 445/470, షేర్ ఖాన్ 431/440, పి.రోహిత్ 431/440 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ కుమారస్వామి తెలిపారు. ఆర్ట్స్ విభాగంలో మానకొండూర్ బాలుర కళాశాలలో ప్రథమ సంవత్సరంలో మనోజ్ 460/500, ఎండీ.రెహాన్ 446/500, రాజేష్ 442/500, ఎం.సాగర్ 433/500 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎండీ.అష్రాఫ్ 866/1000, సీహెచ్ చందు 857/1000, డి.అభిషేక్ 828/1000 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు.

అదేవిధంగా బాలికల కళాశాలల్లో కరీంనగర్ గర్ల్స్-2 ఎంపీసీ (MPC), బైపీసీ (BIPC) విభాగంలో ద్వితీయ సంవత్సరంలో తబుస్సమ్ లారా 988/1000, అఫ్రీన్ ఫాతిమా 982/1000, సాజిదా 981/1000 మార్కులు సాధించారని, అదే విధంగా 900లకు పైగా మార్కులు (Inter 2026 Results) సాధించిన విద్యార్థులు సంఖ్య గణనీయంగా ఉందని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో అలీజా మరియం 459/470, మెహరోజ్ తంకీన్ 458/470, షేక్ సుహానా 450/470 మార్కులు సాధించారని, 400లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 మంది ఉన్నారని ప్రిన్సిపాల్ ఎన్.సరిత ఈ సందర్భంగా తెలిపారు.

ఆర్ట్స్ విభాగంలో చొప్పదండి బాలికల కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో జాస్మిన్ 965/1000, మౌనిక 959/1000, పావని 957/1000, శీరీన్ 950/1000, రుత్విక 933/1000 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ జి. వారుణీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిశెట్టి సంపత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం వల్లే ఈ విజయాలు సాధ్యం అయ్యాయని తెలిపారు. మైనారిటీ గురుకులాల కో-ఆర్డినేటర్ రమేష్ లాల్ హత్కర్, విజిలెన్స్ అధికారులు ఎం.డి. అక్రమ్ పాషా, ఇంతియాజ్ అలీ, అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఎం.డి. మీరాజ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనారిటీ గురుకులాల సొసైటీ అధ్యక్షులు ఫహీమ్ ఖురేషి, సెక్రటరీ బి. షఫీఉల్లా, డీఐఓ సుభాన్‌లకు ప్రిన్సిపల్స్ కృతఙ్ఞతలు తెలిపారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, ఈ అవకాశాన్ని మైనారిటీలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7995057932 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Read Also: న‌ర‌సింహ స్వామికే శ‌ఠ‌గోపం.. యాదాద్రి ఆల‌య ఆదాయానికి గండి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>