కలం, వెబ్ డెస్క్: నటుడు సోనూసూద్ (Sonu Sood) తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మరోసారి ఆయన తన ఉదారతను చాటుకుంటూ ఓ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరా అనే చిన్నారికి జూపిటర్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో క్లిష్టమైన శస్త్రచికిత్స చేయించి ఆ పాప (Child) ప్రాణాలను కాపాడారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేక నిరాశలో ఉన్న నీరా తల్లి పోరాటానికి అండగా నిలిచిన సోనూసూద్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎవరి జీవితంపైనా ఆశ వదులుకోవద్దు’ అంటూ సందేశాన్ని పంచుకున్నారు. సోనూసూద్ (Sonu Sood) చేసిన ఈ సాయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
-చిన్నారికి పునర్జన్మ.. మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్!
-ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి శస్త్రచికిత్స చేయించి, కొత్త జీవితాన్ని ప్రసాదించిన రియల్ హీరో
Real-Life Hero: Sonu Sood Grants a New Lease of Life to a child Through Critical Surgery.#SonuSood #LifeSavingSurgery… pic.twitter.com/licjF1Bfrn— Kalam Daily (@kalamtelugu) April 20, 2026
Read Also: అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ అడిగితే ఇవ్వలేదు: ఆర్య
Follow Us On: X(Twitter)

