నిర్మల్‌లో వైభవంగా ‘గురు పౌర్ణమి’ వేడుకలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామన్న దత్త సాయి ఆలయంలో బుధవారం ‘గురు పౌర్ణమి’ (Guru Purnima) వేడుకలను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి, సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్న మహా మంగళహారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

గురు పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఆలయాన్ని సందర్శించి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సూపరిండెంట్ రంగు రవి కిషన్ గౌడ్, ఇన్చార్జి ఈవో భూమయ్య, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>