కలం, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL) 2026లో ఆదివారం అత్యంత ఉత్కంఠ పోరు జరిగింది. కేకేఆర్, లక్నో (LSG vs KKR) మధ్య జరిగిన మ్యాచ్ స్కోర్ తక్కువే అయినా సస్పెన్స్, థ్రిల్‌కు ఏమాత్రం కొదవలేదు. అయితే ఈ మ్యాచ్‌లో పరుగుల వేటే కాదు రికార్డుల వేట కూడా జరిగింది. ఈ ఒక్క మ్యాచ్‌లో 11 రికార్డ్‌లు బ్రేక్ అయ్యాయి. సరికొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ డ్రా అవ్వడంతో సూపర్ ఓవర్‌తో మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించారు. సూపర్ ఓవర్లో కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసి మ్యాజిక్ చేస్తే, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ తొలి బంతికే బౌండ్రీ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో పాటు తన పేరిట మూడు రికార్డ్‌ను నమోదు చేశాడు. రిషబ్ పంత్ పేరుపై రెండు, మొహ్‌సిన్ ఖాన్ పేరుపై మూడు రికార్డ్‌లు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో నమోదైన ప్రధాన రికార్డులు ఇవే:
రింకూ సింగ్: ఐపీఎల్‌లో తన అత్యధిక స్కోరు (83 నాటౌట్) నమోదు చేశారు. అలాగే టీ20 క్రికెట్‌లో 300 ఫోర్ల మైలురాయిని దాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆయనకు ఇది మొదటి అర్ధశతకం.
మొహ్సిన్ ఖాన్:
ఐపీఎల్‌లో ఒక భారతీయ ఎడమచేతి వాటం పేసర్‌గా అత్యుత్తమ గణాంకాలు (5/23) నమోదు చేశారు. లక్నో తరపున ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచారు.
రిషబ్ పంత్:
టీ20 ఫార్మాట్‌లో 250 సిక్సర్లు, 500 ఫోర్ల మార్కును చేరుకున్నారు.
కేకేఆర్ సరికొత్త రికార్డు:
ఎనిమిదో వికెట్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి రింకూ, నరైన్ జోడీ 62 పరుగులు జోడించింది. కోల్‌కతా చరిత్రలో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
అరుదైన అవుట్:
అంగ్క్రిష్ రఘువంశీ ఐపీఎల్ చరిత్రలో ‘ఫీల్డింగ్‌ను అడ్డుకున్నందుకు’ (Obstructing the field) అవుట్ అయిన నాలుగో బ్యాటర్‌గా నిలిచారు.
ఐపీఎల్ చరిత్ర:
లీగ్ చరిత్రలో ఇది 16వ టై మ్యాచ్‌గా రికార్డులకెక్కింది.

