కలం, నిర్మల్: ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఒకవైపు రక్షాబంధన్, మరోవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు కావడంతో భైంసా పట్టణంలోని ఆయన నివాసంలో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు ఎమ్మెల్యేకు లడ్డూలతో తులాభారం వేసి ఆకట్టుకున్నారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

