భైంసా పల్లవి రైస్‌ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీలు

కలం, బైంసా: భైంసా మండలం వానల్‌పాడ్(Wanalpad) గ్రామంలోని పల్లవి రైస్ మిల్లులో శనివారం రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, రికార్డుల్లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం ధాన్యం 6,102.08 మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం మిల్లులో 5,904.435 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండాల్సి ఉంది. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించగా కేవలం 79.44 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే లభ్యమైంది. దీంతో మిల్లులో 5,824.995 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రభుత్వ ధాన్యం నిల్వలకు (Govt Paddy Stock) సంబంధించి భారీ వ్యత్యాసం గుర్తించడంతో అధికారులు అక్కడికక్కడే పంచనామా నిర్వహించి, ధాన్యం నిల్వలు, రికార్డులకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. గుర్తించిన భారీ వ్యత్యాసంపై సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. బాధ్యుడైన రైస్ మిల్లర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల సమయంలో రైస్ మిల్లర్ అందుబాటులో లేకపోగా, పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>