పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

కలం, వెబ్ డెస్క్: పసిడి ప్రియులకు బంగారం ధరలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. శ్రావణ మాసం వేళ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి (Gold Price Hike). గురువారం నాటి మార్కెట్ వివరాల ప్రకారం..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 4,300 పెరిగి, రూ. 1, 59, 270 కు చేరుకుంది. అదే విధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,950 పెరిగి రూ. 1,46,000 కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా డాలర్ బలహీనపడటం, అదే సమయంలో పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల దేశీయంగా బంగారం ధరలు ఈ స్థాయిలో రికార్డు సృష్టించాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>