కలం, వెబ్ డెస్క్: మంగళవారం రోజు శాసన మండలి సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు (BRS MLCs) త్రీ లైన్ విప్ జారీ అయింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మండలిలో జరిగే చర్చలతో పాటు ఏ బిల్లు, తీర్మానం, ఓటింగ్ ప్రక్రియలో పార్టీ నిర్ణయించిన ప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా పని చేస్తే అనర్హత చర్యలు తప్పవని ఎమ్మెల్సీలకు పంపించిన లేఖలో విప్ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) పేర్కొన్నారు. మండలి సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో గైర్హాజరు కావొద్దని సూచించారు.
కీలక బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం..
అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో కీలక బిల్లులు ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు (BRS MLCs) విప్ జారీ చేసింది. వీటిపై జరిగే చర్చలో సీఎం రేవంత్ రెడ్డి సైతం స్వయంగా హాజరై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Also Read : తాతా మధును మండలి నుండి తొలగించాలి.. కాంగ్రెస్ ఫైర్
Follow Us On: X(Twitter)

