టీమ్ ఇండియాలో అంతా సవ్యంగా లేదా? గంభీర్‌పై షాకింగ్ రిపోర్ట్!

కలం, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాలో అంతా సవ్యంగా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) కోచింగ్ విధానంపై కొందరు సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయం ఇప్పుడు భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. నివేదిక ప్రకారం.. కొందరు సీనియర్ ఆటగాళ్లు మాజీ భారత క్రికెటర్లు, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో అనధికారికంగా తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని పేర్కొంది.

పరాజయాల తర్వాత గంభీర్ బాధ్యత తీసుకోవడం లేదనే అభిప్రాయం కూడా బీసీసీఐ వర్గాల్లో ఉందని నివేదిక తెలిపింది. దీంతో ఆయనపై ఒత్తిడి మరింత పెరిగినట్లు పేర్కొంది. అయితే గంభీర్‌పై బీసీసీఐకి ఇప్పటికీ పూర్తి విశ్వాసం ఉందని అదే నివేదిక స్పష్టం చేసింది. ఆయన హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నారని వెల్లడించింది. ఇక భారత్‌కు తదుపరి సవాల్ శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగం. ప్రస్తుతం భారత్ ఐదో స్థానంలో ఉంది.

గంభీర్ హయాంలో టెస్టుల్లో భారత్ మిశ్రమ ఫలితాలు సాధించింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో సిరీస్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో 0-2తో ఓడింది. ఇంగ్లండ్‌లో మాత్రం 2-2తో సిరీస్‌ను సమం చేసింది. శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు గాయాల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. ఇటీవల వైట్‌బాల్ ఫార్మాట్‌లో ఎదురైన నిరాశాజనక ఫలితాల తర్వాత, శ్రీలంక టెస్టు సిరీస్ గంభీర్‌తో పాటు టీమ్ ఇండియాకు కీలకంగా మారనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>