గ్యాస్ వినియోగదారులకు షాక్.. బుకింగ్ లో కీలక మార్పు..

కలం, వెబ్ డెస్క్ : గ్యాస్ సిలిండర్ల (Gas cylinders) విషయంలో చమురు కంపెనీలు కీలక మార్పులు చేశాయి. ఇప్పటి వరకు ఉన్న బుకింగ్ పీరియడ్ ను మళ్లీ పెంచాయి. ఇంతకు ముందు ఒక సిలిండర్ (Gas cylinders) బుక్ చేసుకున్న తర్వాత ఇంకోటి బుక్ చేసుకోవాలంటే 21 రోజులు ఆగాలి. అయితే ఈ 21 రోజులను తాజాగా 25 రోజులకు పెంచాయి కంపెనీలు. దీంతో ఒక సిలిండర్ బుక్ చేసుకున్నాక 25 రోజుల దాకా ఇంకో సిలిండర్ బుక్ చేయడానికి వీల్లేదు. వాస్తవానికి రెండు రోజుల క్రితమే 21 రోజుల రూల్ తీసుకొచ్చాయి కంపెనీలు. కానీ అది కూడా సరిపోవట్లేదని ఇప్పుడు మళ్లీ పెంచాయి.

ఎందుకంటే..?

పశ్చిమాసియాలో ఇరాన్ వర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు భీకరంగా యుద్ధం చేస్తున్నాయి. దీంతో గ్యాస్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని కస్టమర్లు అవసరానికి మించి అదనంగా బుకింగ్ లు చేస్తున్నారు. మొన్ననే రూ.60 రూపాయలు సిలిండర్ మీద కేంద్రం పెంచింది. దీంతో రాబోయే రోజుల్లో మరింత పెంచుతారేమో.. గ్యాస్ కొరత ఏర్పడుతుందేమో అని.. ముందుగానే బుకింగ్ లు చేసుకుంటున్నారు. దీంతో అదనంగా వచ్చే బుకింగ్ లను తగ్గించి.. అర్హులైన వారికే గ్యాస్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు. గత నాలుగు రోజులుగా రెగ్యులర్ గా వచ్చే బుకింగ్స్ కంటే 20 శాతం అదనంగా వస్తున్నాయంట. దీంతో ఈ అదనపు బుకింగ్ లను తగ్గించేందుకు రెండు రోజుల క్రితం 21 రోజుల పీరియడ్ తీసుకొచ్చారు. అయినా సరే అదనపు బుకింగ్ లు ఆగకపోవడంతో 25 రోజులకు పెంచారు. అధికారులు మాత్రం ఇండియాలో గ్యాస్ కొరత లేదని.. కావాల్సినంత నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. అదనపు బుకింగ్ లు చేయొద్దని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>