యాదగిరిగుట్ట ఎంపీడీవో ఆఫీసులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండలం ఎంపీడిఓ (Yadagirigutta MPDO) కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంచార్జి ఎంపీడీవో శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, మానవతా విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతి వ్యక్తి హక్కులను గౌరవించడం, సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, మహిళల, బాలల రక్షణ, పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రజలతో కలిసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. “సత్యం, అహింస, సేవా భావం – సమాజ అభివృద్ధికి మార్గదర్శకం” అనే గాంధీజీ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముక్కెర్ల మల్లేష్, గుండ్లపల్లి భారత్ గౌడ్, బిక్షపతి, నువ్వుల రమేష్, మాజీ కో ఆప్షన్స్ మెంబెర్ యాకుబ్, పన్నీరు భరత్, అధికారులు, సిబ్బంది సక్కుబాయి, రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>