కలం, భూపాలపల్లి: ములుగు ఘనపూర్ (Mulugu Ghanpur) పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతారాంపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ బృందం మంగళవారం సాయంత్రం దాడి చేసింది. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి రూ.7,990 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఘనపూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.

