కలం, నిర్మల్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13న నిర్వహించనున్న హిందూ యువ సమ్మేళనాన్ని (Hindu Yuva Sammelan) విజయవంతం చేయాలని నగర కార్యవాహ కిన్నెర్ల రవి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నారాయణరెడ్డి మార్కెట్, గంగ కాంప్లెక్స్‌లలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిన్నెర్ల రవి మాట్లాడుతూ డిమార్ట్ ఎదురుగా ఉన్న ఎం.కె. కన్వెన్షన్ హాల్లో ఈ నెల 13న సాయంత్రం 5:30 గంటలకు హిందూ యువ సమ్మేళనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు, మేధావులు, హిందూ సమాజంలోని ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

