చేయూత పెన్షన్లపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఫోకస్

కలం, యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పథకం (Cheyutha Pension) ద్వారా అందించనున్న నూతన పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) యాదగిరిగుట్ట (Yadagirigutta) మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేపటి నుంచి ఉదయం వేళల్లో సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో  ప్రజలకు అందుబాటులో ఉండాలని బీర్ల అయిలయ్య సూచించారు. చేయూత పథకం ద్వారా నూతన పెన్షన్లకు అర్హులైన వారి దరఖాస్తుల స్వీకరణకు సహకరించాలని కోరారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతర లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని  పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>