కలం, జోగుళాంబ గద్వాల: గద్వాల (Gadwal) టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర కాలనీ సమీపంలో పేకాట స్థావరం పై బుధవారం గద్వాల టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు పేకటారాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.7,500 నగదు, మూడు సెల్ ఫోన్ లు, రెండు బైక్ లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

