ప్రతి ఎకరానికి సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

కలం, జోగులాంబ గద్వాల : నడిగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం‌ ధరూర్ మండల పరిధిలోని గూడెందొడ్డి గ్రామం సమీపంలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫేజ్-1 (Nettempadu) పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి, ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా కాలువలకు సాగునీటిని ఎమ్మెల్యే ప్రారంభించారు.

​ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపి రైతుల వ్యవసాయ అవసరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేలా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని, వర్షపాతం తగ్గడం వల్ల ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గే ఉందని, అందువల్ల అధిక నీరు అవసరమయ్యే వరి సాగును వీలైనంత మేర తగ్గించి.. కంది, పెసర, మినుము, శనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని గద్వాల ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: కామన్వెల్త్ గేమ్స్: సాజన్ ప్రకాశ్ అవుట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>