పోలీస్ కమీషనర్ సమక్షంలో భారీగా గంజాయి దగ్ధం

కలం, కరీంనగర్: జిల్లా పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police) పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి, 1 గంజాయి మొక్కను బుధవారం ధ్వంసం (Ganja Destroyed) చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ వెల్లడించారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గంజాయిని దహనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్‌లు రఫీక్, శ్రీలత, ఆర్ఐలు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డిలతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: ఉదయ్‌కృష్ణారెడ్డికి రిమాండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>