కలం , జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) నియోజకవర్గంలో వాడవాడలా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో గణనాథులు పూజలందుకుంటున్నారు. రెండో రోజు మంగళవారం గణేష్ మండపాలలో ప్రతిష్టించిన గణనాథులకు ప్రతినిత్యం మండప నిర్వాహకులు, స్థానిక ప్రజలు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలలో, గ్రామాలలో, వాడవాడలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన మండపాల్లో వినాయకుడు విభిన్న రూపాల్లో కొలువుదీరి పూజలందుకున్నాడు.
మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులు, భారీ సెట్టింగులతో మండపాలు, విభిన్న రూపాలలో గణపతులు భక్తుల విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పలు మండపాలలో ప్రతిష్టించిన గణనాథులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మీ, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్, బీజేపీ, టీఅర్ఎస్, కాంగ్రెస్, రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజాపతినిధులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే పాపాలు తొలగిపోతాయని వారు అన్నారు. ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ప్రజలంతా వినాయకుని కృపతో ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించారు.

