తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి కారు దగ్ధం!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. గచ్చిబౌలి (Gachibowli Accident) ఐఎస్‌బీ రోడ్డులో మారుతి సుజుకి షోరూమ్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారులో నుంచి కిందకు దిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ దుర్ఘటనకు అతివేగంతో పాటు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>