కలం, వెబ్‌డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam) నగరంలోని వడ్లపూడిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ (Flyover) ఒక్కసారిగా కుప్పకూలింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడుతుండంగా అకస్మాత్తుగా కూలడంతో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నాసిరకపు పనుల వల్లే ఫ్లైఓవర్ కూలిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

