కలం వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్-2 (Dhurandhar 2) విడుదలై నెల రోజులు దాటుతున్నా ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. డైరెక్టర్ ఆదిత్యాధర్ పనితీరుకు, యాక్టర్ల నటనకు అందరూ ఫిదా అయ్యారు. కథ, కథనం, నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్.. ఇలా అన్నీ మూవీకి ప్లస్ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ధురంధర్‌కు ప్రశంసల వర్షం కురిసింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు సినిమాను ఫుల్‌గా ప్రమోట్ చేశారు. ఇక ధురంధర్-2 రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. తాజాగా మరో కొత్త రికార్డు దిశగా ఈ మూవీ దూసుకెళ్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి-2 (Baahubali-2) పేరు మీద ఉన్న రికార్డును చెరిపేసే దిశగా ధురంధర్ ముందుకెళ్తోంది. ధురంధర్-2 మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1797.54 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరో రూ.2.46 కోట్లు రాబడితే బాహుబలి-2 పేరు మీద ఉన్న రికార్డు బద్దలైపోతుంది. గతంలో బాహుబలి సినిమా లైఫ్‌టైంలో రూ.1800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ధురంధర్ ఈ రికార్డును ఒకట్రెండు రోజుల్లో కొల్లగొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

