Mobile Popup Ad
Mobile Popup Ad

చిత్తూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటు చేసుకుంది. ఓ కంటైనర్ లారీని కారును ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని గంగవరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. కంటైన‌ర్ లారీని కారు వేగంగా వ‌చ్చి ఢీకొట్ట‌డం వ‌ల్ల ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు బెంగ‌ళూరు నుంచి తిరుప‌తి వైపు వెళ్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన స్పాట్‌లోనే కారులోని ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు యువ‌కులు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>