Mobile Popup Ad
Mobile Popup Ad

బరువు తగ్గడానికి కార్డియో వేస్ట్? ఫిట్‌నెస్ కోచ్ షాకింగ్ నిజాలు!

కలం, వెబ్ డెస్క్:  బరువు తగ్గాలి అన్న ఆలోచన కలిగిన వెంటనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రన్నింగ్ లేదా కార్డియో ఎక్సర్‌సైజ్‌లే. బరువు తగ్గడానికి కార్డియో బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఫేమస్ ఫిట్‌నెస్ కోచ్ డాన్ గో మాత్రం కార్డియో వేస్ట్ అని అంటున్నారు. కేవలం కార్డియో వ్యాయామాలు మాత్రమే చేయడం వల్ల బరువు తగ్గలేరని చెప్తున్నారు. పైగా ఇది చాలా అసమర్థమైన పద్ధతి అని, తనకున్న 20 ఏళ్లకు పైగా అనుభవంతో చెప్తున్నానని వివరించారు డాన్ గో. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ.. కార్డియో వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని, కానీ బరువు తగ్గడానికి మాత్రం ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు.

‘‘కార్డియో వ్యాయామాల వల్ల మనం అనుకున్నంతగా క్యాలరీలు కరగవు. మనం ఎంత ఎక్కువగా రన్నింగ్ లేదా సైక్లింగ్ చేస్తే, మన శరీరం దానికి అంతగా అలవాటుపడిపోయి కాలక్రమేణా ఇంకా తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం ప్రారంభిస్తుంది. దీనికి తోడు, ఎక్కువగా కార్డియో చేయడం వల్ల ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల గంటల తరబడి కష్టపడి కరిగించిన క్యాలరీలను, ఆకలి తట్టుకోలేక ఒకే ఒక్క నిమిషంలో మళ్లీ ఆహారం రూపంలో లోపలికి పంపే ప్రమాదం ఉంది’’ అని చెప్పారు. అంతేకాకుండా, దీనివల్ల కొవ్వుతో పాటు శరీరంలోని కండరాలు కూడా కరిగిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.

ట్రెడ్‌మిల్‌పై వంద క్యాలరీలు కరిగించడం కంటే, వంద క్యాలరీల ఆహారాన్ని తినకుండా నియంత్రించుకోవడం చాలా సులువైన మార్గమని ఆయన తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా బరువులు ఎత్తడం (వెయిట్ లిఫ్టింగ్), నడక (వాకింగ్) అనేవి బరువు తగ్గడానికి అత్యుత్తమమైన మార్గాలని డాన్ గో సూచించారు. బరువులు ఎత్తడం వల్ల కండరాలు బలోపేతమై, మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా శరీరం కొవ్వును కరిగించేలా మెటబాలిజాన్ని పెంచుతుందని వివరించారు. అలాగే, వాకింగ్ చేయడం వల్ల కీళ్లపై ఎలాంటి ఒత్తిడి పడకుండా, ఆకలి పెరగకుండా సులువుగా బరువు తగ్గొచ్చని పేర్కొన్నారు. ఈ రెండు పద్ధతులను కలిపి క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో, శరీరాన్ని కష్టపెట్టకుండా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>