కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ (Narsapur) పట్టణంలో బోనాల పండుగ వేడుకల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మల్పర్తి హర్షవర్ధన్ (19) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. బోడా అఖిల్, ఇర్ఫాన్ లతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నర్సాపూర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

