AIతో వ్యక్తిగత వివరాలు పంచుకుంటున్నారా?.. నిపుణుల హెచ్చరిక ఇదే!

కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో ఏఐ (AI) వినియోగం మానవ జీవితంలో ఒక విడదీయరాని భాగమైంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ఎన్నో పనుల వెనుక ఏఐ సాంకేతికత దాగి ఉంది. ముఖ్యంగా డబ్బు నిర్వహణ, పెట్టుబడులు, అప్పుల చెల్లింపులు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి అంశాల్లో చాలామంది AI సహాయం తీసుకుంటున్నారు. ఇవే కాదు ఇంకా చాలా విషయాల్లో ఏఐ సహాయం తీసుకుంటున్నారు.

మనకు ఎంతో సౌకర్యవంతంగా అనిపించే ఈ టెక్నాలజీ వెనకు పెద్ద ప్రమాదమే దాగి ఉంటుందని హెచ్చరిస్తున్నారు సైబర్ భద్రత నిపుణులు. ముఖ్యంగా మనం వ్యక్తిగత ఆర్థిక వివరాలను AI చాట్‌బాట్ల (AI Chatbots) లో పంచుకుంటాము. ఇవి మనకు ఎంతో సహాయం చేసినప్పటికీ, వాటితో మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు నిపుణులు. డేటా లీక్, మోసాలు, ఐడెంటిటీ చోరీ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దాదాపు 29 శాతం మంది AI వినియోగదారులు తమ వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారం చాట్‌బాట్లలో నమోదు చేస్తున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో తమ సమాచారం బయటకు వెళ్లిపోతుందనే భయం కూడా ఎక్కువమందిలో ఉన్నట్లు తేలింది. మరోవైపు ప్రముఖ AI కంపెనీల ప్రైవసీ పాలసీలపై జరిగిన పరిశోధనలో చాలావరకు చాట్ డేటాను AI మోడళ్ల శిక్షణ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని సంస్థలు ఆ డేటాను నిరవధికంగా భద్రపరుస్తున్నాయని కూడా నివేదికలు చెబుతున్నాయి. వెల్లడించారు భద్రత నిపుణులు.

ఈ విషయాలు ఏఐతో పంచుకోవచ్చు

నిపుణుల సూచనల ప్రకారం.. AI చాట్‌బాట్లతో మాట్లాడేటప్పుడు కొన్ని కీలకమైన విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. వాటిలో మొదటగా పేరు (Name), ఇంటి చిరునామా (Address), ఆధార్ నంబర్ (Adhar Number), పాన్ నంబర్ (Pan Number), డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) వంటి వ్యక్తిగత గుర్తింపు వివరాలను ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఈ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే బ్యాంక్ ఖాతాలు, లోన్లు, క్రెడిట్ కార్డుల దుర్వినియోగానికి దారి తీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ఏఐ చాట్‌బాట్లతో వ్యక్తిగత పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>