ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి అధికారి

కలం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ఏసీబీ (Telangana ACB) అధికారుల‌కు మ‌రో అవినీతి అధికారి ప‌ట్టుబ‌డ్డాడు. పెద్దప‌ల్లి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న దొంకెన రవీందర్ లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కరీంనగర్ ఏసీబీ అధికారులు బుధ‌వారం పెద్దపల్లిలోని రవీందర్ నివాసంలో దాడులు నిర్వహించారు. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి రెడ్డిరాజుల రాజయ్యను కూడా అధికారులు పట్టుకున్నారు. ఒక కేసులో నిందితులకు అనుకూలంగా సాక్షుల విచారణ జరిగేలా చూడటంతో పాటు, ధర్మారం పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదై కోర్టులో విచారణలో ఉన్న క్రిమిన‌ల్‌ కేసును నిర్దోషులుగా ముగించేందుకు సహకరిస్తానని చెప్పి రవీందర్ ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేశారు.

మొదట ఈ కేసుల‌కు సంబంధించి ర‌వీంద‌ర్‌ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఆ త‌ర్వాత ఫిర్యాదుదారుడి రిక్వెస్ట్‌ మేరకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని మధ్యవర్తి రాజయ్య ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజయ్య జేబులో నుంచి లంచం డ‌బ్బులు రూ.1.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్, రాజయ్యలను తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>