Mobile Popup Ad
Mobile Popup Ad

గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

కలం, వెబ్ డెస్క్: మనదేశంలో గుడ్ల ధరలు (Egg Prices) ఒక్కసారిగా పడిపోయాయి. గత నెలలో రూ. 7 పలికిన ఒక గుడ్డు నేడు 3.50 నుంచి 4.00 రూపాయలు పలుకుతోంది. గుడ్ల ధరలు దిగిరావడంతో సామాన్యులు సంతోషిస్తుండగా పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు, రైతులు లబోదిబోమంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణమే తగ్గుదలకు కారణమని తెలుస్తోంది. యుద్ధ ప్రభావంతో భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులు దాదాపు నిలిచిపోయాయి. దీంతో దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఎగుమతులకు బ్రేక్.. రేవుల్లోనే నిలిచిపోయిన గుడ్లు

భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడులోని నామక్కల్ ప్రాంతంతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒమన్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు ప్రతిరోజూ లక్షలాది గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు కోటి గుడ్లు ఈ దేశాలకు పంపుతారని సమాచారం. అయితే యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్టులు, విమాన సర్వీసులు ప్రభావితమవడంతో రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. దాదాపు వెయ్యికి‌పైగా కంటైనర్లలో నిల్వ ఉంచిన గుడ్లు రేవుల్లోనే నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో గుడ్లను దేశీయమార్కెట్ లోకి తీసుకొచ్చారు.

గుడ్లు త్వరగా పాడయ్యే పరిస్థితి ఉండటంతో ఎగుమతిదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు నిలిచిపోవడంతో విదేశాలకు వెళ్లాల్సిన గుడ్లు దేశీయ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో సరఫరా పెరిగి ధరలు పడిపోతున్నాయి. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) అంచనాల ప్రకారం ఒక గుడ్డు ధర (Egg Prices) సుమారు రూ.4.50 ఉండాల్సి ఉండగా, కొన్ని మార్కెట్లలో అది రూ.3.30 నుంచి రూ.3.50 వరకు పడిపోయింది. ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దేశంలో గుడ్ల ఎగుమతుల్లో నామక్కల్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 90–95 శాతం వాటా అక్కడి నుంచే ఉండటంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

Read Also: టీలో చక్కెర మానేయాలా.. ? ఈ చాక్లెట్ హ్యాక్ ట్రై చేయండి..

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>