Mobile Popup Ad
Mobile Popup Ad

దేశ రక్షణకు ‘ప్రజ్ఞ’ అస్త్రం: హోం శాఖ చేతికి AI శాటిలైట్ సిస్టమ్

కలం, వెబ్​ డెస్క్​ : భారత అంతర్గత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం (DDR&D) సెక్రటరీ, అత్యాధునిక శాటిలైట్ ఇమేజింగ్ వ్యవస్థ ‘ప్రజ్ఞ’ (Prajna)ను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అధికారికంగా అందజేశారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్-3లో ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

డీఆర్‌డీఓ (DRDO) పరిధిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) ల్యాబ్ ఈ వ్యవస్థను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, హోం మంత్రిత్వ శాఖకు అత్యవసర సమయాల్లో రియల్ టైమ్ డేటాను అందిస్తుంది. దీని ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత భారత అంతర్గత రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, నిఘా వ్యవస్థ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>